calender_icon.png 8 October, 2024 | 5:09 PM

సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

08-10-2024 02:27:04 AM

ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి స్థలం కేటాయింపుపై అధ్యాపకులు, పూర్వవిద్యార్థులు

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ సమావేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ(జేఎన్‌ఎఫ్‌ఏయూ)కి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి 10 ఎకరాల స్థలం కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామన్నామని యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రముఖులు అన్నారు.

సోమవారం హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ప్రిన్సిపాల్, ప్రొ.ఎస్‌ఎం పీరమ్, దశరథ్‌రెడ్డి, పూర్వ విద్యార్థులు రవీందర్‌రెడ్డి, గౌరీశంకర్ తదితరులు మాట్లాడుతూ.. 1940లో నిజాం హయాంలో ఏర్పాటు చేసిన చారిత్రక ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఏళ్ల తరబ డి కేవలం మూడున్నర ఎకరాల్లోనే సాగుతుందన్నారు.

ప్రస్తుతం మాసబ్ ట్యాంక్‌లో ఉన్న యూనివర్సిటీకి స్థలం సరిపోక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులను, జూబ్లీహిల్స్‌లోని చిత్ర పరిశ్రమ ల్యాబ్‌లను దృష్టిలో పెట్టుకొని డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. ఈ నిర్ణయంతో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకు మేలు కలగజేయడంతో పాటు కళలకు మరింత ప్రోత్సాహం కలుగుతుందన్నారు.

అంబేద్కర్ యూనివర్సిటీ మేధావులు, అధ్యాపకులు, సిబ్బంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సహకరించాల ని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ యూనివర్సిటీలోని వాతావరణం ఫొటోగ్రఫీ, కళాకారుల కు ఉపయోగకరంగా ఉంటుందని, కళలకు మరింత ప్రోత్సాహం కలుగుతుందన్నారు. సమావేశంలో ఆర్టిస్టులు రాజేందర్, బసవరాజ్, సుధానిది, కాంతారెడ్డి పాల్గొన్నారు.