20-03-2025 01:22:26 AM
శాసన సభలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ ను స్వాగతిస్తున్నామని, బడ్జెట్‌లో వ్యవసాయం, నీటిపారుదల, పశువర్ధక శాఖలకు కలిపి దాదాపు 15 శాతం నిధులు కేటాయించడం పట్ల సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమ లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడతామని ఇచ్చిన హామీ రైతాంగానికి మేలు చేస్తుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పథకానికి 700 కోట్ల రూపాయలు కేటాయింపులతో పాటుగాభక్తరామదాసు, తాలిపేరు, పెదవాగు, కిన్నెరసాని ప్రాజెక్టు లు, వైరా రిజర్వాయర్‌లకు ఆధునీకరణ, మరమ్మతులు, నిర్వహణ కోసం నిధులు కేటాయించిన ప్రభుత్వానికిజిల్లా రైతాంగం తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లమల వెంకటేశ్వరరావు