18-03-2025 07:59:49 PM
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్ నార్ రమేష్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో బీసీ బిల్లు ఆమోదాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్ నార్ రమేష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఈ చట్టం బీసీల ఐక్యతకు నిదర్శనమని, ఎన్నో పోరాటాల ద్వారా విజయం సాధించామన్నారు. రిజర్వేషన్లను పెంచుతూ చట్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు బిల్లుకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.
చట్టం ద్వారా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రావలసిన హక్కులు పూర్తిస్థాయిలో అందుతాయని తెలిపారు. రాష్ట్రంలో బిల్లు ఆమోదం అనంతరం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బీసీలకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బాలేష్, ప్రధాన కార్యదర్శి గాజుల జక్కన్న ,రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి పటేల్, నాయకులు విశ్వనాథ్, కమలాకర్, బాలు, సత్యనారాయణ ,శ్యామ్ రావు, నాందేవ్, తదితరులు పాల్గొన్నారు.