భువనగిరి ఎంపీ చామల
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాం తి): రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనతో ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.31 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ పెట్టుబడులపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు సరికావని, కేటీఆర్ బంధువులు వచ్చినా ప్రభు త్వం సహకరిస్తుందని తెలిపారు. అమరరాజా కంపెనీకి ప్రభుత్వం సపోర్టు ఇస్తుం దని, కొంతమంది కావాలనే తప్పుడు ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు.
సోమవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన అమెరికాలో ముగిసి, దక్షిణ కొరియాకు వెళ్లారని చెప్పారు. ఐటీ, ఫార్మా, ఏఐ కంపెనీలతో పాటు మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించాయని తెలిపారు. సీఎం రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఈ 8 నెలల్లోనే రెండుసార్లు విదేశీ పర్యటనలు చేశారని గుర్తుచేశారు. సీఎం విదేశీ పర్యటనపై బీఆర్‌ఎస్ బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదని హితవు పలికారు. తాము తప్పులు చేస్తే నిలదీయొచ్చని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు బీజేపీ ఎంపీలు కూడా తమతో కలిసిరావాలని ఆయన కోరారు.