calender_icon.png 15 November, 2024 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నాం

10-09-2024 03:49:49 AM

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్

ఢాకా(బంగ్లాదేశ్), సెప్టెంబర్ 9: భారత్‌తో తమ దేశం సత్సంబంధాలను కోరుకుంటోందని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ తెలిపారు. ఇటీవల రిజర్వేషన్ల అంశంపై జరిగిన నిరసన, ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతతో యూనస్ సమావేశమయ్యారు. భారత్ తో సంబంధాలపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నపై యూనస్ మాట్లాడుతూ..  ‘భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలని భావిస్తున్నాం.

ఇవి రెండువైపులా కచ్చితంగా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. పొరుగుదేశాలతో సంబంధాల విషయంలో బంగ్లాదేశ్ పరస్పర గౌరవం ఇస్తుంది. సార్క్ ను పునరుద్ధరించాలి’ అని ఆయన కోరారు. భారత్‌లో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ విమర్శలు చేస్తున్నారని, వాటివల్ల ఇరుదేశాల సంబంధాలపై ప్రతికూల వాతావరణం చూపించే అవకాశం ఉందన్నారు. 

పులస ఎగుమతిపై నిషేధం

గతేడాది దుర్గాపూజకు ముందు భారతీయలకు ఎంతో ఇష్టమైన పులస చేపను 4వేల టన్నుల వరకు ఎగుమతి చేసిన బంగ్లా సర్కార్.. ఈ ఏడాది నిలిపివేసింది. బంగ్లాలో అలర్లకు కారణమైన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీన భారత్‌లో తలదాచుకోవడం, ఆమె తమ దేశంపై భారత్ వేదికగా విమర్శలు చేస్తుండటంతో అక్కడి ప్రభుత్వం భారత్‌పై గుర్రుగా ఉంది.