calender_icon.png 1 April, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి

29-03-2025 10:26:45 PM

విద్యార్థులకు ఎస్ఐ పాండు సూచన...

అందోల్: డ్రగ్ రహిత తెలంగాణ కోసం మనమందరము కృషి చేయాలని ముఖ్యంగా టీనేజ్ లోని విద్యార్థులు మాదకద్రవ్యాల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని జోగిపేట ఎస్సై పాండు సూచించారు. మాదకద్రవ్యాలపై ఏదైనా సమాచారం తెలిస్తే 1098కు సమాచారం అందించాలని తెలిపారు. శనివారం నాడు సంగుపేట లోగల  ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు "మాదకద్రవ్యాలు వద్దు జీవితం ముద్దు" అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

డ్రగ్స్ వలన యువత ఎలాంటి చెడుదారుల్లో నడవకుండా మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని హితువు పలికారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి మంచి  భవిష్యత్తుతో జీవన యానం సాగించాలని  తెలంగాణ యాంటీ నార్కటిక్  సోల్జర్స్ ... వ్యక్తిత్వ వికాస శిక్షకులు కొంక రాజేశ్వర్, దొబ్బల ఉదయ్ కుమార్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.  మీ కుటుంబాలలో మీ పరిసర ప్రాంతాలలో మాదక ద్రవ్యాల వినియోగం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1098 తెలియజేసి మీ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ స్పందన ,  టీచింగ్ అసోసియేట్స్ హర్షిత , సంహిత తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.