calender_icon.png 26 March, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సాయానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాం

25-03-2025 05:59:02 PM

కుల సంఘాల నాయకులు...

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని గోదావరి రోడ్ లో నిర్మించిన మహాప్రస్థానం నిర్వహణ కోసం స్వచ్చందంగా ఆర్ధిక సాయం చేయడానికి ముందుకు వచ్చామని కుల సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుల సంఘాల నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్యే మమ్ములను బెదిరించలేదని, మేము స్వచ్ఛందంగా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చామని, మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారన్నారు. సకల సౌకర్యాలతో నాలుగు ఎకరాల్లో మహాప్రస్థానం నిర్మిస్తే అక్కసుతోనే మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ... గతంలో స్మశాన వాటిక నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే చందాలు ఎందుకు వసూలు చేశారని నిలదీశారు.

మహాప్రస్థానం నిర్వహణ కోసం ప్రజల భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో మంచిర్యాల సంక్షేమ సంఘం పేరిట కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే మంచి నిర్ణయాలను దురుద్దేశకంగా తప్పుడు ప్రచారం చేయడం శోచనీయమన్నారు. ఆర్య వైశ్య సంఘం నాయకుడు అప్పాల రాము, మార్వాడీ సమాజ్ నాయకుడు పవన్ మాట్లాడుతూ... ఎమ్మెల్యే బెదిరించాడనే ఆరోపణలు అసత్యమన్నారు. స్వచ్చందంగా ఆర్ధిక సహాయం చేయడానికి సంఘం సభ్యులు ముందుకు వచ్చారన్నారు. ప్రజా సేవ చేయడంలో మార్వాడీ సమాజం ఎప్పుడు ముందు వరుసలో నిలుస్తోందని, అందులో భాగంగానే మహాప్రస్థానం నిర్వహణకు చందాలు ఇవ్వడానికి ముందుకు వచ్చామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కుల సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.