బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రజాకార్. ఈ చిత్రాన్ని సమర్‌వీర్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. యాటా సత్యనారాయణ దరకత్వం వహిం చారు. గతేడాది థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఈ నెల 24వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడు తూ.. “సినిమాలను డబ్బు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేస్తుంటారు. కానీ మేము ‘రజాకార్’ సినిమాను ఒక బాధ్యతతో చేశాం. నిజాం పాలన లో రజాకార్లు సాగించిన అకృత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించాలనే ప్రయత్నం చేశాం. ఈ సినిమా నిర్మించే క్రమంలో నాకు ఎన్నో బెదిరింపులొ చ్చాయి.
నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. కానీ నేను భయపడలేదు. సినిమాను నిర్మించాను” అని తెలిపారు. నటి ఇంద్రజ మాట్లాడుతూ.. “రజాకార్ల అకృత్యాలకు ఈ సినిమా గొప్ప డాక్యుమెంటరీ. మన నేల చరిత్ర గురించి తెలుసుకోవడం ఇక్కడ బతికే ప్రతి ఒక్కరి బాధ్యత. ముస్లిం జర్నలిస్ట్ క్యారెక్టర్ మా సినిమాలో గొప్పగా ఉంటుంది. ఈ సినిమాలో వీరనారి చాకలి ఐలమ్మ క్యారెక్టర్‌లో నటించాను.
ఆమె ఒక నిప్పురవ్వలా అప్పటి అకృత్యాలపై ఎదురుతిరిగారు” అన్నారు. దర్శకుడు సత్యనారా యణ మాట్లాడుతూ.. “మా రజాకార్ మూవీకి తెలుగుతోపాటు హిందీ, మరాఠీ, ఇతర భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. 18 ఫిలిం ఫెస్టివల్స్‌కు అప్లు చేస్తే 15 ఫిలిం ఫెస్టివల్స్‌కు సెలెక్ట్ అయ్యింది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు నాగ మహేశ్, ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి పాల్గొన్నారు.