calender_icon.png 2 February, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవాణా విభాగం నుంచి ఒక ఆర్డరే తీసుకున్నాం

02-02-2025 01:30:56 AM

ఎన్‌సీసీ వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ(కర్ణాటక) లిమిటెడ్ నుంచి జనవరి నెలలో కేవలం ఒకే ఒక్క ఆర్డర్‌ను మాత్రమే తీసుకున్నట్టు నాగార్జున కన్‌స్ట్రక్చర్ కంపెనీ(ఎన్‌సీసీ) లిమిటెడ్ వెల్లడించింది.

ఈ మేరకు శనివారం ఓ ప్రెస్‌నో ట్‌ను విడుదల చేసింది. సాధారణ లావాదేవీలలో భాగంగానే ఈ ఆర్డర్‌ను స్వీకరిం చినట్టు ప్రెస్‌నోట్‌లో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆర్డర్ వ్యవధి 24నెలలుగా పేర్కొం ది.

గత నెలలో కర్ణాటక ప్రభుత్వ రవాణా విభాగం నుంచి తీసుకున్న ఆర్డర్ విలువను జీఎస్టీతో కలిపి రూ.424.79కోట్లుగా వెల్లడించింది. తాజా ప్రెస్‌నోట్‌ను జనవరి 7న ఇచ్చిన ప్రెస్‌నోట్‌కు అనుబంధంగా ఇస్తున్నట్టు ఎన్‌సీసీ స్పష్టం చేసింది.