calender_icon.png 19 January, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండస్ట్రియల్ పార్క్‌కు భూములు ఇచ్చేవారిని ఆదుకుంటాం

19-01-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్, జనవరి 18: మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం అసైన్డ్ భూములు ఇస్తున్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  తెలిపారు. శనివారం దుద్యాల మండలం పోలేపల్లి గ్రామ రైతులతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపాలన్నారు.  శనివారం  మొత్తం 34 మంది రైతులు హాజరయ్యారు. 

దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామంలో మొత్తం 73.39 ఎకరాల భూమి ఉందని దీనిపై రైతులతో చర్చ నిర్వహించి రైతుల సమ్మతాన్ని పొందినట్లు కలెక్టర్ తెలిపారు. సమ్మతి అవార్డు పొందిన రైతులకు  ఎకరానికి 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలములో ఇందిరమ్మ ఇల్లు, ఇంటికి ఒక ఉద్యోగం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 

కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్  రెవెన్యూ లింగ్యా నాయక్ , తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ ఉమా హారతి , టిజిఐసి జోనల్ మేనేజర్ శైలజ,  అసిస్టెంట్ జోనల్ మేనేజర్ అజీమ సుల్తానా,  సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ ఏడి రామ్ రెడ్డి , ఆర్ అండ్ బి ఇఇ  శ్రీధర్ రెడ్డి, దుద్యాల తహసిల్దార్ కిషన్ పాల్గొన్నారు.