calender_icon.png 23 January, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీధర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం

22-10-2024 01:41:08 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు

వనపర్తి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి 5 నెలలు గడుస్తున్నా నిందితులను పట్టుకోకపోవడం తగదని నాగర్‌కర్నూల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు అన్నారు. శ్రీధర్‌రెడ్డి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని, హత్య కేసు విషయంలో 20 రోజుల్లో న్యాయస్పందన రాకుంటే నియోజకవర్గ ప్రజలందరితో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సోమవారం చిన్నంబావి మండల పోలీస్ స్టేషన్ ముందు స్థానిక నాయకులతో బైఠాయించారు. డీఎస్పీ అక్కడికి చేరుకుని సముదాయించారు. ఈ సందర్భంగా క్రాంతి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గంలో హత్య జరిగితే ఇప్పటికి న్యాయం జరగకపోవడం ప్రభుత్వానికి, మంత్రికి సిగ్గుచేటన్నారు.