సాయి సంజీవని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అంజయ్య, పిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లం పాండు..
మునుగోడు (విజయక్రాంతి): విద్యార్థుల అభ్యున్నతికి విద్యాభివృద్ధికి తోడ్పాటునందించాలనే లక్ష్యంతో పిఆర్ఆర్ ఫౌండేషన్ పనిచేస్తుందని సాయి సంజీవని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అంజయ్య అన్నారు. శుక్రవారం మునుగోడు మండలంలోని కొంపల్లి, పలివెల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మునుగోడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లం పాండుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు లాస్ట్ మినిట్ రివిజన్ బుక్ పరీక్షలకు ఉపయోగపడే విధంగా పిఆర్ఆర్ ఫౌండేషన్ స్టడీ మెటీరియల్ అందించడం అభినందనీయం అన్నారు.
నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రామా బాయ్ జయంతి సందర్భంగా జ్ఞానం వర్ధిల్లాలని విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజికంగా చైతన్యం చేస్తూ విద్యతో పాటు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని మార్పు దిశగా ప్రయత్నం చేస్తున్న పిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు కృషి అభినందనీయమని అన్నారు. నేటి సమాజంలో కోట్ల రూపాయలు సంపాదించి విలాసవంతమైన జీవితం గడిపేవారు చాలామంది ఉన్నారు కానీ సొసైటీ కోసం విద్యార్థులకు జ్ఞానం కోసం సమాజ మార్పు కోసం ప్రయత్నించే వారు అరుదుగా ఉంటారు అందులో పిఆర్ఆర్ చైర్మన్ చేల్లం పాండురంగారావు ఉంటారని ఆయన అన్నారు. భవిష్యత్తులో పిఆర్ఆర్ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా మా సాయి సంజీవని హాస్పిటల్ పాత్ర వైద్యంతో పాటు విద్యారంగంలో కూడా ఉంటుందని తెలిపారు. ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గండికోట రాజేష్, ఎండి రఫీ, రేణుక, దత్తీశ్వర్, యాదయ్య, వెంకటేశ్వర్లు, సంజీవ, గిరి పాల్గొన్నారు.