calender_icon.png 26 April, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదాన్ని అంతమొందిద్దాం

26-04-2025 12:11:43 AM

కశ్మీర్ లో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం 

ఒక్క మనిషిని చంపితే మొత్తం మానవాళిని చంపినట్టే అని ఇస్లాం బోదిస్తుంది

సిద్దిపేట, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఉగ్రవాదానికి మతం లేదని సిద్దిపేట ముస్లిం మత పెద్దలు అన్నారు. ఇటీవల కాశ్మీర్ లోని పెలగావ్ లో జరిగిన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండస్తున్నామన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం నమాజ్ తర్వాత జిల్లా కేంద్రం లోని పలు మస్జీద్ ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. దాడిలో మృతి చెందిన వారికి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పిం చారు. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడ్డ ఉగ్రవాదులను తుడిచి పెట్టేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇస్లాం మతం లో ఉగ్రవాదానికి తా వు లేదని అన్నారు.

మతం పేరుతో చెసే మరణ హోమన్ని ఏ ధర్మం కూడా ఒప్పుకోదని అన్నారు. యాత్రికులను తమ ప్రాణా లు అర్పించి కాపాడిన కాశ్మీర్ ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. గంగా, యమున, తహజీబ్ ను కాశ్మీరీలు చాటి చెప్పారని అన్నారు. కొంతమంది ఏంత ద్వేషం  నింపిన మీరు మాత్రం ప్రేమను పంచాండని ముస్లిం లకు పిలుపునిచ్చారు. ఇలాంటి దుషచార్యాలకీ పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని  ప్రభుత్వం త్వాన్ని కోరా రు. ఇలాంటి దాడులు మరోసారి జరుగకుండా నిఘా ను పటిష్టం చేయాలనీ, మన ఆర్మీకి అన్ని రకాల సదుపాయలు కాల్పించాలన్నారు.

ఉగ్రదాడిపై ముస్లిం నాయకుల నిరసన

చేగుంట :జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చేగుంట మండల మైనార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని జామ మసీదు వద్ద కమిటీ అధ్యక్షులు (సదర్ ) ఆధ్వర్యంలో ఉగ్ర దాడిని నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో పట్టణ మైనారిటీ నాయకు లు, ప్రజలు  పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు ఉగ్రవాదులు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని, అటువంటి వారిని ప్రభుత్వం పట్టుకొని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షకీ ల్, రహీముద్దీన్, అలీ, అన్వర్, జలీల్, అజీం, నయీమ్, హుసేని, ఇలియాస్, జమీల్, ఖలీల్ ఆరిఫ్  పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ

పటాన్ చెరు, ఏప్రిల్ 25 : కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడికి నిరసనగా పటాన్ చెరు డివి జన్ పరిధిలోని ఏపీఆర్ కాలనీ వాసులు గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి చర్యలు ఇక ముందు జరుగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టిగా జవా బు చెప్పాలన్నారు. మృతులకు శాంతి చేకూరాలనీ,  వారి కుటుంబాలకు ధైర్యం ప్రసా దించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఎ ర్ర బాబురావు, అనురాధ, పుష్ప, రామేశ్వర మ్మ, మౌనిక, వసుందర, అరుణ, తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రవాదులను ఉరి తీయాలి

పటాన్చెరు,:కాశ్మీరు రాష్ట్రం పహల్గాంలో తీవ్రవాదులు  మతం పేరున చేసిన మారణ హోమాన్ని నిరసిస్తూ ఇస్నాపూర్ ముస్లిం సో దరులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.  తీవ్రవాదులను వదిలిపెట్టరాదని, మతకలహాలను సృష్టించే లక్ష్యంతో ముందుకు వెళ్తు న్న పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ పై యుద్ధం చేసినా ముస్లింలు కేంద్ర ప్రభుత్వం వెంబడి ఉంటారని వారు స్పష్టం చేశారు. 

పటాన్చెరువు మండలంలో ఇస్నాపూర్ చౌరస్తాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ముస్లిం సోదరులు చేతికి నల్ల బ్యాడ్జిలు ధరిం చి నమాజులు చదివారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకుడు మేరేజ్ ఖాన్ మాట్లాడు తూ ఉగ్రవాదులను నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అబెద్, మునీరుద్దీన్, మీర్ ముహియుద్దీన్, నాసర్, కలీం తదితరులు పాల్గొన్నారు.