28-03-2025 12:19:21 AM
సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు డి.కిషన్
అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 27: సీపీఎం నాయ కులపై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు డి. కిషన్ అన్నారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రామోజీ ఫిలింసిటీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని తుర్కయంజాల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు డి. కిషన్ మాట్లాడుతూ.. సీపీఎం నాయకులపై అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాలకు చెందిన నిరుపేదలకు సుమారు 600 మంది నిరుపేదలకు 600 గజల చొప్పున 2007లో వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సుమారు 20 ఎకరాలలో లే అవుట్ చేసి పట్టాలు ఇచ్చారన్నారు.
ఆ ఇండ్ల స్థలాలలో రామోజీ యజమాన్యం యథేచ్చగా అక్రమంగా ప్రహారీ గోడ నిర్మిస్తుంటే.. ప్రభుత్వ ఏమీ చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిరుపేదలకు కేటాయంచిన ప్రభుత్వ భూమిలోని ఇండ్ల స్థలాల్లో ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని... అలాగే సీపీఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ సభ్యులు జే ఆశీర్వాదం, ఎం. సత్యనారాయణ, బడుగు మాల్యాద్రి, పి. శ్రీనివాసులు, ఐ కృష్ణ, బడుగు శంకరయ్య, ఎ. మాధవరెడ్డి, ఎం యాదయ్య, ఎన్. యాదగిరి, హనుమంత్‌రెడ్డ, ధర్మారెడ్డిరాజు, లింగారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.