calender_icon.png 26 December, 2024 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీకీ అండగా ఉంటాం

07-11-2024 12:52:56 AM

ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): భాగ్యనగర్ టీఎన్జీవోస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత ఉద్యోగ జేఏసీదే అని టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు.

సొసైటీకి స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలం గా ఉన్నందున సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భాగ్యనగర్ టీఎన్జీవోస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ముత్యాల సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.

సమావేశా నికి ముఖ్య అతిథిగా హాజరైన మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. సొసైటీని అప్రతిష్ట పాలు చేసేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాలను సభ్యులు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి తీపి కబురు వచ్చే అవకాశం ఉందన్నారు.

సొసైటీకి అండగా టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్, ఉద్యోగ జేఏసీ ఉం టుందన్నారు. టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్, కస్తూరి వెంకటేశ్వర్, సొసైటీ కార్యదర్శి జీ మల్లారెడ్డి, జీ రామేశ్వర్‌రావు, ఏ శ్రీనివాస్, ఎస్ ప్రభాకర్‌రెడ్డి, కేశియా నాయక్, పీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.