calender_icon.png 30 October, 2024 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం

07-07-2024 12:05:00 AM

మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, జూలై 6 (విజయక్రాంతి): హత్నూర మండలంలోని చందాపూర్ ఫార్మా పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతిచెందిన కార్మికుల కుటుం బాలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ అన్నారు. పేలుడు ఘటనలో మృతిచెందిన ఐదుగురు కార్మికుల కుటుంబ సభ్యులకు శనివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతిచెంది న కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.41 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు.

ఫార్మా పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి చెక్కులు పంపిణీ చేశామన్నారు. పరిశ్రమలో జరిగిన పేలుడులో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు మెరుగైన నష్ట పరిహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) అభినవ్ తదితరులు పాల్గొన్నారు.