మంత్రి సీతక్క హామీ
జైనూర్ బాధిత మహిళకు పరామర్శ
కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ చేసిన దాడిలో గాయపడిన ఆదివాసి గిరిజన మహిళకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో చికిత్స పొందిన మహిళ ఆదివారం డిశ్చార్జ్ కావడంతో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావుతో కలసి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
మహిళకు రూ.20 వేల అర్థిక సహాయం చేయడంతో పాటు దుస్తులను అందజేశారు. ఏజెన్సీల్లో జైనూర్‌లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం సదరు మహిళను ప్రత్యేక వాహనంలో జైనూర్‌కు పంపించారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఉన్నారు.