కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కుటుంబాలకు శాఖపరంగా అండగా ఉంటామని ఎస్పీ డివి శ్రీనివాస్ రావు అన్నారు. లింగాపూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన నారాయణ కుటుంబానికి మంజూరైన భద్రత ఎక్స్ గ్రేషియా రూ.8.60 లక్షల చెక్కును బుధవారం తన కార్యాలయంలో అందజేశారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పరంగా అందాల్సిన బెనిఫిట్లను త్వరలో వచ్చేలా చూస్తామన్నారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఏఎస్ఐ కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ అజయ్ వర్మ, పోలీస్ సంఘం అధ్యక్షుడు విజయ శంకర్ రెడ్డి, సీసీ కిరణ్, ఏఎస్ఐ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.