calender_icon.png 26 October, 2024 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వానికి అండగానే ఉన్నాం: టీఎఫ్‌సీసీ

05-07-2024 12:00:00 AM

చిత్ర పరిశ్రమ సామాజిక బాధ్యత వహించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖానించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై స్పందిస్తూ తెలుగు చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) ఓ ప్రతికా ప్రకటన విడుదల చేసింది. ఇటీవల గౌరవ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులు కలిసినపుడు పరిశ్రమకు సంబంధించిన విషయాలపై సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ విషయంలో ముందు నుంచి చిత్ర పరిశ్రమ ప్రభుత్వానికి అండగా ఉందని వివరించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి తాము ఎల్లవేళలా  తోడ్పాటును అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై టీఎఫ్‌సీసీ త్వరలో ముఖ్యమంత్రితో సమావేశం కానుంది.