calender_icon.png 12 October, 2024 | 3:20 AM

వరద బాధితులకు అండగా ఉంటాం

04-09-2024 12:05:49 AM

  1. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 
  2. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి 

ఆదిలాబాద్/నిర్మల్/మంచిర్యాల, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): వరద బాధితులకు అన్నివిధాల అండగా ఉంటామని ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలోని వరద ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. తెలంగాణ సరిహద్దులోని జైనథ్ మండలం డోలారా వద్ద గల పెన్ గంగా నది ఉధృతిని ఎమ్మెల్యే పాయల్‌శంకర్, కలెక్టర్ రాజరిషా, ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి మంత్రి పరిశీలించారు. ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మల్ పట్టణంలోని ముంపునకు గురైన జీఎన్‌ఆర్ కాలనీని పరిశీలించారు.

స్వర్ణవాగు పరివాహక ప్రాంతంతో ఉన్న జీఎన్‌ఆర్ కాలనీ ముంపునకు గురి కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. వారికి కావల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేటలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రామగుండం సీపీ శ్రీనివాసులు, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు కుమార్ దీపక్, కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్‌లతో కలిసి సందర్శించారు. దిగువ ప్రాంతాలకు ప్రణాళికబద్ధంగా నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

వరదలతో పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. నష్టపోయిన రైతులు అధైర్యానికి గురికావద్దని, రాష్ర్ట ప్రభుతం అండగా ఉంటుందని భరోసీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో జరిగిన వరద నష్ట నివారణకు సాయం చేయాలని కోరారు. కాగా రైతులకు పరిహారం చెల్లించాలని, దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలకు మరమ్మతులు చేయాలని మంత్రికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ విన్నవించారు. దిలువార్‌పూర్ మండలం వద్ద నిర్మిస్తున్న ఇథానాల్ పరిశ్రమను రద్దు చేసి రైతులను ఆదుకోవాలని రైతు జేఏసీ నాయకులు మంత్రికి వినతిపత్రం అందించారు. నిర్మల్  అటవీ శాఖ విశ్రాంతి భవనంలో వివిధ సంఘాల నాయకులు మంత్రిని కలిసి వినతి పత్రాలు అందించారు. 

సీసీఐ పునరుద్ధరణకు సహకరిస్తాం

మంత్రి శ్రీధర్‌బాబు

ఆదిలాబాద్(విజయక్రాంతి): ఆదిలాబాద్‌లో మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్ట రీని కేంద్ర ప్రభుత సహకారంతో తెరిపిస్తామని, రాష్ర్ట ప్రభుతం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే పాయ ల్ శంకర్, కలెక్టర్ రాజరిషా,  ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి సీసీఐని సందరించారు. ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ఆశిష్ శర్మతో మాట్లాడారు. ఫ్యాక్టరీ ప్రస్తుత పరిస్థితి, పునరుద్ధరణ అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీసీఐ పునరుద్ధరణకై ఎమ్మెల్యే పాయల్ శంకర్ గట్టి సంకల్పంతో పని చేస్తున్నారని అభినంది ంచారు. ఇటీవల కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారసామిని సైతం కలిసి చర్చించినట్టు గుర్తు చేశారు. కేంద్రం సానుకూ లంగా ఉన్నందున రాష్ర్ట ప్రభుతం తరఫున అన్ని విధాల సహా య సహకారాలు అందిస్తామని చెప్పారు. ఫ్యాక్ట రీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అక్కడి అధికారులకు మంత్రి సూచించారు.