మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, జనవరి 19 : ఆర్య వైశ్యులకు అన్నిరకాలుగా అండగా ఉంటా మని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వాళ్లు వ్యాపా రాలతో పాటు రాజకీయాలు కూడా చేయాలన్నారు. కాంగ్రెస్ ఫుల్ సపోర్టు అందిస్తుందన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు.
ఆర్యవైశ్యులకు అన్నిరకాలుగా సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. వాళ్లు వ్యాపారంతోపాటు రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. హుస్నాబాద్ ఏఎంసీ డైరెక్టర్లతోపాటు కొత్తకొండ, సుందరగిరి ఆలయాల చైర్మన్ పదవులను ఆర్యవైశ్యులకే ఇచ్చినట్టు చెప్పారు. హుస్నాబాద్ లోని ఆర్యవైశ్య భవనంలో కల్యాణమండపంతో పాటు ఏసీ హాల్ కోసం రూ. 45లక్షలు ఇచ్చామన్నారు.
అక్కన్నపేటలో పదెకరాల స్థలంలో గోశాల నిర్మించనున్నట్టు తెలిపారు. ఆర్యవైశ్యుల ఆర్ధిక, వ్యాపార, రాజకీయ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వెనుకబడిన పేదలకు చేయూత పథకం కింద వృత్తిపరమైన సహకారాన్ని అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ సుజాత, సంఘం సభ్యులు పాల్గొన్నారు. మహాసముద్రంగండి వద్ద కరీంనగర్ లోని కశ్మీర్ గడ్డకు చెందిన వాకర్స్ అసోసియేషన్ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఆ అసోసియేషన్ అధ్యక్షుడు, కరీంనగర్ మేయర్ సునీల్ రావుతోపాటు సభ్యులకు మహాసముద్రంగండి గురించి వివరించారు. అనంతరం ఆయన అక్కన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.