calender_icon.png 18 October, 2024 | 10:54 AM

కార్యకర్తలకు అండగా ఉంటాం

18-10-2024 02:40:58 AM

. జగిత్యాల మాజీ జెడ్పీ 

చైర్‌పర్సన్ వసంత

కరీంనగర్, అక్టోబరు 17 (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలపై ప్రశ్నించినం దుకే కక్షపూరితంగా బీఆర్‌ఎస్ నేత మహేష్‌పై కేసు నమోదు చేశారని జగిత్యాల జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ఆరోపించారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన రాయికల మండలం అల్లిపూర్ గ్రామ బీఆర్‌ఎస్ నాయకుడు అనుమల్ల మహేష్‌ను బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి గురువారం దావ వసంత పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేవలం 10 నెలల పరిపాలనలోనే రా్రష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందని.. ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలననే కావాలని కోరుకుంటున్నారని అన్నారు. జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని.. వారందరికీ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మహేష్, అతడి కుటుంబ సభ్యులకు బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.