calender_icon.png 8 October, 2024 | 10:18 PM

మాల్దీవులకు అండగా ఉంటాం

08-10-2024 01:40:12 AM

ముయిజ్జుకు ప్రధాని మోదీ హామీ

ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ద్వైపాక్షిక చర్చలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: మాల్దీవులకు సాయం అందించడంలో భారత్ ఎల్లప్పు డూ ముందుంటుందని ప్రధాని మోదీ హా మీ ఇచ్చారు. 4రోజుల పర్యటనలో భాగంగా ఇండియాకు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సోమవారం ఢిల్లీలోని హైదరబాద్‌హౌస్‌లో మోదీతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మాల్దీవులతో భారత్‌కు ఉన్న స్నేహం గురించి మోదీ గుర్తు చేశారు. మాల్దీవులకు కష్టమొస్తే ఆదుకునే విషయంలో భారత్ ముందువరుసలో ఉంటుందన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరా, ప్రాజెక్టులకు సాయం గురించి ప్రస్తావించారు. మాల్దీవుల్లో రూపే కార్డుతో పేమెంట్ సేవలు ప్రారంభించి.. తొలి లావాదేవీని ఇరువురు వీడియో కాన్పరెన్స్ ద్వారా వీక్షించారు.

400 మిలియన్ డాలర్ల, 3వేల కోట్ల రూపాయల కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్‌పై ఇరువురు సంతకం చేశారు. మాల్దీవుల్లో ఒక ఎయిర్‌పోర్టును ప్రారంభించామని, 700 హౌసింగ్ యూనిట్స్‌ను నిర్మించి ఇచ్చామని మోదీ తెలిపారు.

తమ దేశంలో పెట్టుబడులు పెంచేందుకు భారత్‌తో స్వేచ్ఛావాణి జ్య ఒప్పందం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. మా టూరిజం మార్కెట్‌కు భారత్ అతిపెద్ద  సోర్స్ అని, భవిష్యత్‌లో టూరిస్టుల సంఖ్య పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.