ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 7 (విజయక్రాంతి): చేనేత కార్మికులకు ప్రభుత్వం అం డగా ఉంటుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. జాతీ య చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం భువనగిరిలోని రాయిగిరి క్రాస్‌రోడ్డు వద్ద ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం చేనేత రంగంలో విశేషంగా కృషి చేసిన కళాకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతు కే జండ గే, డీసీపీ రాజేష్‌చంద్ర, అడిషనల్ కలెక్టర్ గంగాధర్, చేనేత సొసైటీల ప్రతినిధులు గర్ధా సు బాలయ్య, పిల్లలమర్రి శ్రీనివాస్, దుడుక ఉప్పలయ్య పాల్గొన్నారు.
రంగారెడ్డి: చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ శశాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులను సత్కరించారు.