calender_icon.png 27 February, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌కు అండగా ఉంటాం

22-07-2024 02:43:23 AM

శరణార్థులకు ఆశ్రయమిస్తాం: మమత

కోల్‌కతా, జూలై 21: బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థుల కోసం తమ రాష్ట్ర తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని బెంగాల్ సీఎం మమ తాబెనర్జీ స్పష్టం చేశారు. ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన అమరవీరుల దినోత్సవ ర్యాలీలో మాట్లాడు తూ.. అది మన పొరుగుదేశం. అక్కడి ప్రజలకు మా సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. బంగ్లాపై భారత వైఖరి మారాలి. బంగ్లా శరణార్థులకు ఆశ్రయం కల్పించడంపై పార్ల మెంట్‌లో విస్తృత చర్చ జరగాలి. మేమైతే వారికి ఆశ్రయం కల్పించేందుకు వెనుకడుగు వేయలేం. బంగ్లా లో హింసాత్మక ఘటనలతో ఇబ్బ ంది పడుతున్న బెంగాల్ ప్రజల బంధువులకు మా పూర్తి సహకారం అందిస్తాం అని మమత స్పష్టం చేశారు.