calender_icon.png 8 November, 2024 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేమే ప్రేక్షకులను చెడగొట్టాం..

18-08-2024 12:00:00 AM

‘రేవు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు 

నాలుగు వారాలకే సినిమాను ఓటీటీలోకి తీసుకువస్తున్నందున ప్రేక్షకు లు థియేటర్లకు రావడంలేదని, కారణమూ తామేనని చెప్పుకొచ్చారు నిర్మాత దిల్ రాజు. ఓటీటీపై తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘రేవు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన ఇలా అన్నారు. “కొత్తవాళ్లతో సినిమాలు తీసే ప్రక్రియ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ, 99 శాతం ఫెయిల్ అవుతాయి. సక్సెస్ రేట్ ఒకే ఒక్క శాతం. కెరీర్ తొలినాళ్లలో  నేను సినిమాలు తీసేటప్పుడు.. నా సినిమాలకు ప్రేక్షకులు ఎలా వస్తారు? ఇంకా ఏమేం యాడ్ చేయాలి? అనుకుంటూ తీసేవాడిని. ఈ రోజుల్లో సినిమా తీ యడం గొప్ప కాదు.

ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి ఆ మూవీ చూడటమే బిగ్ ఛాలెంజ్. మే ము తీసిన ‘బలగం’, ‘కమిటీ కుర్రోళ్లు’ నెమ్మది గా మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులకు చేరాయి. అదే సమయంలో సినిమా బాగుందని రివ్యూ లు ఇవ్వడమూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అసలు ప్రేక్షకులను చెడగొట్టింది మేమేలెండి.. ‘మీరు ఇంట్లో కూర్చోండి. నాలుగు వారాల్లో ఓటీటీకి తెస్తాం’ అని థియేటర్‌కు రాకుండా చేసుకున్నాం. ఈ సినిమా ‘రేవు) చూసి నేను కూడా రివ్యూ రాస్తా (నవ్వులు). మంచి సిని మా. అదీ చిన్న మూవీ అయితే, ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ సహకారం అందించాలి” అని దిల్‌రాజు అన్నారు.