calender_icon.png 20 January, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనూ కోసం 2 కోట్లు ఖర్చు చేశాం

30-07-2024 12:36:54 AM

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి దేశ ఖ్యాతిని పెంచిన భారత షూటర్ మనూబాకర్ శిక్షణ కోసం ప్రభుత్వం రూ. 2 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. పతకం సాధించి భారత్‌ను గర్వపడేలా చేసిన మనూకు అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఖేలో ఇండియాలో ఆడినట్లు మనూ కూడా చెప్పిందన్నారు. దేశంలో క్రీడాకారుల స్థితిగతులను మార్చేందుకు వారికి కావాల్సిన సదుపాయాల్ని కల్పించేందుకు ఖేలో ఇండియా పోటీలు ఎంతో దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. వారికి కావాల్సిన కోచ్‌లను ఏర్పరచుకునేందుకు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మనూ బాకర్ శిక్షణ కోసం రూ. 2 కోట్లు ఖర్చుపెట్టామని, ఆమెను శిక్షణ కోసం జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలకు పంపించినట్లు వెల్లడించారు.