‘ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత చదవులు చదివిన ఉద్యోగాలు రాలేదు. డిగ్రీ, పీజీ చేసిన ప్రైవేట్ కంపెనీలో పని చేసే పరిస్థితి ఉంది. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా.. పాటలతో ప్రజలను చైతన్యపరిచా.. పేద కుటుంబం కావడంతో చదువుటూనే ఉదమ్యంలో పాల్గొని గ్రామాలు, పట్టణాల్లో సంస్కృతిక కార్యక్రమలు నిర్వహించాం.. ప్రత్యేక రాష్ట్రం అవసరాన్ని ప్రజలకు వివరించాం.. రాష్ట్ర సాధన కోసం కాళ్లకు గజ్జలు కట్టుకొని.. భుజానికి డప్పు వేసుకుని ఊరూరా తిరిగాం’ అని అంటున్నారు సంగారెడ్డి జిల్లా రాయిపల్లి గ్రామానికి చెందిన ఉద్యమకారుడు అయిదాల సునీల్.
నేను హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నా. డిగ్రీ చదువుకుంటూనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. 2009లో సిటీ కళాశాలలో తెలంగాణ ధూంధాం నిర్వహిస్తుండగా ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం, ప్రముఖ గాయకుడు సాయిచంద్‌తో పాటు పాటలు పడుతున్న సమయంలో పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి గోషామహల్ స్టేషన్‌కు తరలించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ‘తెలంగాణ సంస్కృతిక సారధి’లో కళాకారునిగా పనిచేసే అవకాశం లభించింది. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేశాను. ఎవరు ఎన్ని అవమానాలు చేసిన పట్టించుకోలేదు. ఉద్యమ సమయంలో నాపై కేసు పెట్టారు. జైలుకు తీసుకెళ్లారు. అయినా ఏరోజు వెనుకడగు వేయలేదు. ఆట, పాటలతో ప్రజలకు జరుగుతున్న అన్యాయలు, అక్రమాలపై పాట రూపంలో ప్రజలకు తెలిపి చైతన్యపరిచాం.
ఊరూరు తిరిగాం..
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర జిల్లాలో తిరిగి పాటలు పడుతు ప్రజలను చైతన్యం చేశారు. కళాకారుడిగా ఎన్నో సంస్కృతిక కార్యక్రమలు నిర్వహించా. తెలంగాణ కోసం ఎక్కడ ఉద్యమాలు జరిగిన అక్కడికి వెళ్లి పాటలు పాడేది.
సంగారెడ్డి జిల్లాలో పటాన్‌చెరువు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజక వర్గంలో ఎక్కడ కార్యక్రమాలు జరిగిన వెళ్లేది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం.. చదువుకుంటు ఉద్యమాలు చేశాను. మా ఫ్రెండ్స్ అందరం ఒక గ్రూప్‌గా ఏర్పడి కళా ప్రదర్శనలు చేసేది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించేవరకు నా పాటను ఆపోద్దని నిర్ణయం తీసుకున్నాను. అదే బాటలో నడిచా కూడా.. చాలామంది అన్నారు.. నీకు అవసరమా? కుటుంబ పరిస్థితి చూశావా? ఎందుకు ఈ పోరాటాలు? అని అనేవారు. అయినా ఎవరి మాటలు వినకుండా ఉద్యమాలు చేశాను. పోలీసులు కొన్ని సార్లు బెదిరించిన పాటలు పాడటం మానుకోలేదు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం..
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు ఎక్కడ సమావేశాలు, సభలు నిర్వహించిన అక్కడికి వెళ్లి పాటలు పాడేది. సకల సజల సమ్మెలో పాల్గొని పాటలు పాడాను. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయకపోవడంతో ఉద్యమకారులు, ఉద్యమాన్ని తీవ్ర తరం చేశారు.
ఆ సమయంలో మా గ్రూప్ సభ్యులం ఎక్కడ ఉద్యమాలు జరిగిన వెంటనే అక్కడికి వెళ్లి పాటలు పాడేది. ఆర్టీసీ బస్సులు, ఆటో, సైకిల్ మోటార్ పై గ్రామాలకు వెళ్లి పాటలు పాడేది. చివరికి నన్ను అందరు ‘తెలంగాణ పాటలు పడే సునీల్’ అనే వారు. రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటలు చేశాం. పాటలు పడుతూ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులతో కలసి పోరాటం చేశాం.
సంక్షేమ పథకాలపై ప్రచారం..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ సంస్కృతిక సారధి’ని ఏర్పాటు చేసింది. సంస్కృతి సారధిలో కళాకారులను ఉద్యోగాలుగా తీసుకుని ప్రభుత్వ పథకాల పై ప్రచారం నిర్వహించే బాధ్యతలు నాకు అప్పుగించారు. అది తూచతప్పకుండా పాటించాను. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కళాకారులు ఎన్నో పోరాటలు చేసిన ఫలితం లేకుండా పోయింది. కళాకారులను గుర్తించి.. వారికి తగిన ఉపాధి కల్పిస్తే బాగుందని నా అభిప్రాయం. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుంది.
కళాకారుల పాత్ర కీలకం..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కళాకారులు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆట, పాటలతో కళాకారులు పట్టణాలు, పల్లెలో పాటలు పడుతు ప్రజలను చైతన్యం చేశాం. తినేందుకు తిండిలేకపోయి ప్రత్యేక రాష్ట్రం కోసం పాటలుపాడేవాళ్లం. గ్రామాల్లో ఎవరైన భోజనం పెడితేనే తినేది. రాత్రి, పగలు రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేశాం. ప్రత్యేక రాష్ట్రంలో కొందరికి మేలు కలిగింది. ఉద్యమాలు చేసి, ఆటపాటలు పడిన మాకు సరైన న్యాయం జరగలేదు. ప్రభుత్వ ఉద్యోగ నియామకల్లో కళాకారులకు తగ్గిన గుర్తింపు లభించలేదు.
-ఆయిదాల సునీల్, కళాకారుడు
గౌని దౌలయ్య, సంగారెడ్డి