calender_icon.png 20 April, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

09-04-2025 01:12:50 AM

బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి 

అతిరథుల సమక్షంలో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ 

హాజరైన ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 

ఎల్బీనగర్, ఏప్రిల్8 : వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మన్సూరాబాద్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అటల్ బిహారీ వాజపేయి జయంతి ఉత్సవాలను బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. మొదటగా వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ పక్కన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీగా మన్సూరాబాద్ లో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. ర్యాలీ వనస్థలిపురం రెడ్ ట్యాంక్, గణేష్ టెంపుల్, రైతు బజార్, సుష్మా టాకీస్ సిగ్నల్, సహారా రోడ్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మన్సూరాబాద్ డివిజన్ లోని ఎంఈ రెడ్డి గార్డెన్స్ లో అటల్ బిహారీ వాజపేయి గారి జయంతి ఉత్సవాలతోపాటు రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతల స్వీకరణ నిర్వ హించారు.

జిల్లా మాజీ అధ్యక్షుడు  సామ రంగారెడ్డి అధ్యక్షన జరిగిన కార్యక్రమంలో వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మా ట్లాడుతూ... బీజేపీ చట్టసభల ప్రస్తానం రెండు సీట్లు నుంచి వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టిందన్నారు. ప్రధాని మోదీ హయాంలో భారతదేశం అగ్రదేశంగా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం దిశగా బీజేపీ అడుగులు వేస్తుందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా పాలన చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్కా కొమరయ్య, బిజెపి జాతీయ నాయకులకు పేరాల శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు బొక్కా నరసింహ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి రవికుమార్ యాదవ్, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ చార్జి అందెల శ్రీరాములు యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్, మణిభూషణ్, కళ్లెం రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు కొప్పుల నర్సింహ రెడ్డి, నవజీవన్ రెడ్డి, ప్రేమ మహేశ్వర్ రెడ్డి, వంగా మధుసూదన్ రెడ్డి, రంగా నర్సింహ గుప్తా, పవన్ కుమార్, లచ్చిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు, మహిళా మోర్చా నాయకులు, యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.