calender_icon.png 19 April, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలి

19-04-2025 01:38:48 AM

చిగిరుమామిది, ఏప్రిల్ 18:దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం, సమ సమాజ స్థాపన లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

చిగురుమామిడి మండలం రేకొండ,ఓగులాపూర్, రామచ, ముదిమాణిక్యం గ్రామాల్లో  సీపీఐ గ్రామ శాఖల మహాసభల జరిగిన సందర్భంలో మ హాసభలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మిక వర్గ శ్రేయ స్సు కోసం, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నిర్మాణం కోసం 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీకి వందేళ్ల   ఉద్యమ చరిత్ర  కలిగి ఉందని పార్టీ బలోపేతం కోసం మండలంలో నాయకులు  కా ర్యకర్తలు పట్టుదలతో కృషి చేయాలని  పిలుపునిచ్చారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో మం డలంలో  సీపీఐ సత్తా ఏంటో చూపించడం కోసం అత్యధిక సర్పంచులు,ఎంపీటీసీలు, ఎంపీపీ,జడ్పిటిసి స్థానాలు గెలుపొందడం కోసంనాయకత్వం  ఇప్పటినుండే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ మహాసభల్లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు,మాజీ జడ్పీటీసీ అందె స్వామి, బో యిని అశోక్,మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కాంతాల శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్న స్వామి,చాడ శ్రీధర్ రెడ్డి, బోయిని పటేల్,ముద్రకోల రాజయ్య,బూడిద సదాశివ మాజీ మండల కార్యదర్శి తేరాల సత్య నారాయణ,రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జయపాల్ పాల్గొన్నారు.