ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిలు
కామారెడ్డి, డిసెంబర్ 29 (విజయక్రాం తి): ప్రభుత్వం బేడ బుడగ జంగం సంక్షేమానికి కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిలు కోరారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని కళాశాలలో నిర్వహించిన బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఎస్సీ 56 ఉప కులాలకు జనాభా దామాషా ప్రకారం అందడం లేదన్నారు. బేడ బుడగ జంగం సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని.. లేని పక్షంలో ఎస్సీ ఉపకులాలను ఏకం చేసి ఉద్యమిస్తామని, మున్ముందు ఆందోళనలను ఉధృతం చేస్తామనన్నారు. కార్యక్రమంలో పోచయ్య, నారాయణ, రమేశ్, కళ్లెం సాయిలు, పండరి తదితరులు పాల్గొన్నారు.