calender_icon.png 19 April, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరకట్ట పునర్నిర్మాణ పనులు చేపట్టి లోతట్టు ప్రాంతాలను కాపాడాలి

19-04-2025 07:19:15 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి...

భద్రాచలం (విజయక్రాంతి): కరకట్ట ఎత్తు వెడల్పు పెంచి లూయిజుల మరమ్మతులు చేపట్టి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ ముదిరాజ్ బజార్, రామాలయ పరిసర ప్రాంతాలను వరద ముప్పు నుండి కాపాడాలి అని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంపీ నర్సారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిపిఐఎం ఇంటింటి సర్వేలో భాగంగా ముదిరాజ్ బజార్ రామాలయం ప్రాంతాలలో స్థానిక సంస్థల సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు సిపిఐ ఎం బృందం దృష్టికి ముంపు సమస్యను తీసుకువస్తూ 2022 సంవత్సరంలో వచ్చిన వరదలతో ఈ ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయారని మళ్లీ వర్షాకాలం రాబోయేలోపే కరకట్ట పనులు పూర్తి చేయాలని విన్నవించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి నర్సారెడ్డి మాట్లాడుతూ... ముంపు సమస్య పరిష్కారం కోసం సిపిఐఎం ఆధ్వర్యంలో పాదయాత్ర సైతం చేసామని గుర్తు చేశారు. ఓ పక్క డంపింగ్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ మూడు నెలల పాటు వరదలతో ఈ ప్రాంతం అతలాకుతలమవుతుందని నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయ పరిషత్ ప్రాంతాలు గోదారి లో జల సమాధి అవుతుంటే పాలకులు నిమ్మకు నీరెక్కినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సంవత్సరం అధిక వర్షపాత నమోదయ్య అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే మేల్కొని కరకట్ట పూననిర్మాణ పనులు చేపట్టాలని లేనియెడల సీపీఐఎం ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం పట్టణ కమిటీ సభ్యులు చుక్క మాధవరావు ధనకొండ రాఘవయ్య శాఖ కార్యదర్శి ధనలక్ష్మి ఆది హైమావతి తదితరులు పాల్గొన్నారు.