నాగారం జనవరి 26 ః ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నాగారం మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా సంక్షేమ పథ కాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వ హించారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ లక్ష్మాపురం గ్రామంలో రైతు భరోసాకు 572 మంది లబ్ధిదారులు ఇంది రమ్మ ఆత్మీయ భరోసాకు12 మంది లబ్ధి దారులను 69 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను 115 మంది లబ్ధిదారుల కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్టు తెలి పారు.
అనంతరం లబ్ధిదారులకు మంజూ రు పత్రాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ బ్రహ్మయ్య ఎంపీడీవో మారయ్య గ్రామ స్పెషల్ ఆఫీసర్ చందన ఏవో కృష్ణ కాంత్ ఎం పి ఎస్ ఓ చింతమల రమేష్ పంచాయతీ కార్యదర్శి గోపి తదితరులు పాల్గొన్నారు