29-03-2025 11:31:27 PM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..
నారాయణపేట (విజయక్రాంతి): యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబిసి, ఈడబ్ల్యుఎస్ వర్గా లకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనునట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 2025 ఏప్రిల్ 5 లోపు ఓబిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా తమకు వర్తించే సంబంధిత కార్పోరేషన్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్పొరేషన్ వారీగా పథకాల వివరాలు పోర్టల్లో పొందుపరచబడినందున, దరఖాస్తుదారులు జాగ్రత్తగా పరిశీలించి తమ అర్హతకు అనుగు పథకాన్ని ఎంచుకోవాలన్నారు.
ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగు లకు ఈ పథకం అమలులో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అన్నారు. దరఖాస్తు దారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వ్యవసాయ సంబందిత పథకాల కోసం పట్టా పాస్ పుస్తకం, దివ్యాంగుల కోసం సదరం, దరఖాస్తుదారుని మొబైల్ నంబర్ వంటి అవసరమైన ధృవపత్రాలు ఉండాలని సూచించారు. యూనిట్ ధర రూ 50 వేల లోపు ఉంటే 100% , 50,001 ల నుండి 1,00,000/- రూపాయలు ఉంటే 90% రాయితీ, 10% బ్యాంక్ రుణం, రూ. 1,00,001 నుండి 2,00,000/- వరకు 80% రాయితీ, 20% బ్యాంక్ రుణం, రూ.2,00,001 నుండి 4,00,000/- వరకు 70% రాయితీ,30% బ్యాంక్ రుణం లభిస్తుందని తెలిపారు.