25-03-2025 07:37:52 PM
మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి...
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంను మండలంలోని మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని కిరణ్మయి కోరారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... కృషి వికాస్ యోజన పథకం వ్యవసాయ యాంత్రీకరణ ఉప మిషన్ ద్వారా అర్హులైన మహిళా రైతులకు బ్యాటరీ లేదా చేతి పిచికారీ పంపులు జనరల్-03, ఎస్టి-01, పవర్ స్ప్రేయర్లు జనరల్-03, ఎస్టి-01, రోటావేటర్లు జనరల్-02, ట్రాక్టర్ పనిముట్లు జనరల్-02 మంజూరయ్యాయని తెలిపారు. ఇవి కేవలం మహిళా రైతులకే మంజూరయ్యాయని ఆమె వివరించారు. సబ్సిడీ తదితర పూర్తి వివరాలకు మండల వ్యవసాయ అధికారి, విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు.