calender_icon.png 13 February, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

13-02-2025 12:00:00 AM

ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం, ఫిబ్రవరి 12 (విజయక్రాం తి) ః  నిరుద్యోగులైన గిరిజన యువతీ యువకులు చదువుకొని ఇంటిపట్టునే ఉం డి ఖాళీగా ఉండకుండా అందివచ్చిన అవ కాశాన్ని సద్వినియోగం చేసుకొని వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకొని తద్వారా జీవనోపాధికి మార్గాలు కల్పించుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. బుధవారం ఐటిడిఏ ప్రాంగణం లోని వైటీసీలో నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు వివిధ స్వయం ఉపాధి పథ కాలపై నిర్వహించిన కౌన్సిలింగ్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అను గుణంగా ప్రతి యువతి, యువకులు చెడు భావాలను మనసులో నుండి తీసేసి మా ర్పు చెంది వృత్తి నైపుణ్యాలు పెంపొందిం చుకోవాలన్నారు.

వృత్తి నైపుణ్యాలు పెం పొందించుకొని ముందుకు పోతున్న దేశా లలో చైనా, జపాన్, దక్షిణ కొరియా రాష్ట్రా లు ముందుకు పోతున్నాయని, ప్రపంచ దేశాలకు పోటీపడి మనం కూడా ముందు కు పోవాలని, పీజీ, బీటెక్, చేసిన యువతీ, యువకులు స్కిల్ డెవలప్మెంట్ పెంపొం దించుకొని వివిధ ప్రభుత్వ ప్రైవేటు రంగా లలో పనిచేస్తూ జీవనోపాధి కల్పించుకుం టున్నారు.

త్వరలో మన రాష్ర్టంలో ఉన్న యువతీ, యువకుల కొరకు స్కిల్ డెవల ప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఐటీడీఏ భవిత సెల్లు ద్వారా నిర్వహించే వివిధ రకాల వృత్తి శిక్షణలో తర్ఫీదు పొంది శిక్ష ణ తీసుకొని స్వయం ఉపాధి పొంది ఆర్థిక వెసులు బాటు కల్పించుకోవాలన్నారు.

ఈ జాబ్ మేళాకు 80 మంది గిరిజన యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారని వారి లో 39 మంది వారి విద్యారతను బట్టి ప్రైవే ట్ కంపెనీలకు సెలెక్ట్ అయ్యారని, 13 మంది వివిధ రకాల శిక్షణలు బ్యూటీషి యన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, కంప్యూ టర్ శిక్షణ కొరకు ఎంపికయ్యారని, మెడిప్లస్ కంపెనీకి 14 మంది, నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంస్థకు 9 మంది, శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆరు గురు, ఓపి సెక్యూరిటీ గార్డులకు పదిమం దిని ఎంపిక చేయడం జరిగిందన్నారు.

వీరికి శిక్షణానం తరం ప్రైవేటు కంపెనీలలో నెలకు 12 వేల నుండి 18 వేల రూపాయల వేతనం వచ్చే లా ప్రైవేటుగా ఉద్యోగ అవకాశాలు కల్పి స్తారని, మిగతా కోర్సులు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి కల్పించుకోవడానికి వెసులుబాటు ఉంటుందన్నారు. కార్యక్ర మంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్‌రాజ్, జేడీఎం హరికృష్ణ, వివిధ కంపెనీల నుండి జగన్, ఉపేందర్, పీటర్, మణికాంత్, ఐటీసీ సంస్థ నుంచి అనూష, శ్రీనివాస్ అంజయ్య భవిత సెల్ సిబ్బంది మణికుమారి, సమ్మయ్య, దినేష్, గిరిజన యువతి యువకులు పాల్గొన్నారు.

చూపరులను ఆకట్టుకునేలా డిజైనింగ్ చేయండి అధికారులకు పీఓ రాహుల్  ఆదేశం 

భద్రాచలం ఫిబ్రవరి 12 (విజయక్రాం తి) ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం,గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పాటు పూర్తిస్థాయిలో హరిత వనంగా సోబిల్లెల చూపరులకు ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు.

బుధవారం  మ్యూజి యం కమిటీ సభ్యులతో కలిసి మ్యూజి యాన్ని సందర్శించి మ్యూజియం పరిసరా లలో ఏర్పాట్లు చేసే వివిధ రకాల పూలు షోకేజ్ చెట్లు, పచ్చటి నారుతో డిజైన్‌గా వివిధ భంగిమలతో తయారుచేసిన కళాకృ తులను ఆయన పరిశీలించారు.

ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాంటేషన్ ఏర్పాటు కొరకు తీసుకువచ్చిన పూల చెట్లను సెల్ఫీ పాయింటు మంచే, నిర్మాణం చేపట్టిన గుడిసెల ముందు అందంగా అమర్చాలన్నారు. మంచెపై వెదురుతో త యారుచేసిన డైనింగ్ సెట్ కుర్చీలు అం దంగా అమర్చాలన్నారు.

గిరిజన మహిళ లు, గిరిజన రైతులు వ్యవసాయ పద్ధతులు, వారి జీవన విధానాలు, సంస్కృతి సాంప్ర దాయాలకు సంబంధించిన పెయింటింగ్స్ 15 రోజుల్లో పూర్తయ్యేలా చూడాలన్నారు. ప్లాంటేషన్ ఏర్పాటు కొరకు తీసుకువచ్చిన పూల చెట్లను, కళాఖండాల వద్ద పర్యాట కులు సెల్ఫీలు దిగేలా అమర్చాలన్నారు. సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, డిఈ హరీష్, టిఏ శ్రీనివాస్ పాల్గొన్నారు.