03-04-2025 12:02:51 PM
బెల్లంపల్లి(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(Bellampally MLA Gaddam Vinod) కోరారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని నెల్కో లైన్ లో గల చౌక ధరల దుకాణంలో లబ్ధిదారులకు సన్న బియ్యం బియ్యం పథకాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడారు. తెలంగాణలోని ప్రజలందరికీ సన్నబియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ ను ఆదేశించారు.
తాను త్వరలోనే నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ దీపక్ కుమార్(Collector Deepak Kumar) మాట్లాడుతూ అర్హులందరికీ సన్న బియ్యం అందిస్తామన్నారు. ప్రభుత్వానికి సన్నాలు అందించిన రైతులకు రూ 500 బోనస్ అందించమన్నారు. సన్న వడ్లు బిల్లింగ్ చేసి ఈ పథకాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే లబ్ధిదారులు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో సరిపడ సన్న బియ్యం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, టీపీసీసీ సభ్యులు చిలుముల శంకర్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, మాజీ మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, స్థానిక మాజీ కౌన్సిలర్ రాజులాల్ యాదవ్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేడి పున్నం చందు, మాజీ కౌన్సిలర్ గెల్లి రాయలింగు, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్, స్థానిక డీలర్ ఏ.ఓదెలు తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, డీలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.