11-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్ ,ఏప్రిల్ 10 (విజయ క్రాంతి) : తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులంలో అందిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక పీటీజీ గిరిజన గురు కులం ప్రిన్సిపాల్ కారం భద్రయ్య గురువారం ప్రకటనలో తెలిపారు.
ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పీవీటీజీ గురుకులంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.మొత్తం 218 సీట్లు ఖాళీలు ఉండగా అందులో 3 లో 80,4 వ తరగతిలో 62, 5 వ తరగతిలో 38,6వ తరగతిలో 21, 8 వ తరగతిలో 17 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.
అర్హులైన పీవీటీజీ తెగలకు చెందిన కాలం తోటి మన్నే విద్యార్థులు ఈనెల 30 వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు గురుకులంలో సంప్రదించాలని అన్నారు.