calender_icon.png 19 April, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘రాజీవ్ యువ వికాసం’ను సద్వినియోగం చేసుకోవాలి

09-04-2025 01:08:51 AM

శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు 

 రాజేంద్రనగర్, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు సూచించారు. ఏప్రిల్ 14 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 92 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.  అందరి అభ్యన్నతి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. శంషాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంటున్నామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. నాయకులతోపాటు ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శంషాబాద్ పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కమిషనర్ సుమన్ రావు పేర్కొన్నారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.