calender_icon.png 3 March, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి

02-03-2025 12:26:26 AM

తెలంగాణ, ఏపీ సీఎంలను కోరిన మంద కృష్ణ మాదిగ

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 1 (విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగ అమరవీరులు ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడారని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు. వారి కుటుంబాలను తెలంగాణ, ఏపీ సీఎంలు ఆ దుకోవాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఓ యూలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గో విందు నరేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో మంద కృష్ణ మాట్లాడారు.

మాదిగ అమరవీరుల కు టుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు ఇవ్వాలని సీఎంలను కోరారు. మాదిగ అమరవీరులకు హైదరాబాదులో ఐదు ఎకరాలలో స్థలాన్ని కేటాయించి స్థూపాన్ని నిర్మించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ సక్రమంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు.