calender_icon.png 12 February, 2025 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథలను ఆదుకోవాలి

12-02-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి

ఎల్బీనగర్, ఫిబ్రవరి 11 : అనాథలను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని బీఆర్‌ఎస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి పిలుపు నిచ్చారు. చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో  ఆదర్శ బాల బాలికల హోమ్ విద్యార్థులకు చంద్రశేఖర్ రెడ్డి తన స్నేహి తులైన గంగాపురం ప్రసాద్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి సహాయంతో రూ. 75 వేల చెక్కు అందజేశారు.

ఆదర్శ ఫౌండేషన్ అనాథ విద్యార్థులకు స్కూల్ ఫీజు బకాయిలు ఉన్నాయని నిర్వాహకుడు ప్రదీప్ సాయం కోరాడు. స్పందించిన బీఆర్‌ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి తన మిత్రులు వరప్రసాద్, ప్రశాంత్ రెడ్డి, కళ్యాణ్, వీరేన్, వేణు, సురేశ్, సూర్య, నరేందర్ సహకారంతో రూ. 75 వేల చెక్కు  మంగళవారం అందించి దాతృత్వం చాటుకున్నారు. కార్యక్రమంలో ప్రసాద్, కళ్యాణ్, సూర్య, ప్రవీణ్, జలంధర్, నరేందర్, శ్రీధర్, నవీన్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.