15-04-2025 12:56:00 AM
టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి
జిల్లా వ్యాప్తంగా ఘనంగా జయంతి ఉత్సవాలు
సంగారెడ్డి, ఏప్రిల్ 14(విజయక్రాంతి): బడుగుల అభ్యున్నతికి పాటుపడిన మహో న్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్.అంబేద్కర్ అని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కొనియాడారు. ఆయన ఆశయ సాధనలో ముందు కు సాగాలని పిలుపునిచ్చారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఆయ న చిత్రపటానికి, విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ జీవితాన్ని స్పూర్తి గా తీసుకొని సమాజంలో అసమానతలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతు లు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి అఖిలేష్రెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రామాచారి, బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ఆర్డీవో రవీందర్రెడ్డి, డీఎస్పీ సత్తయ్యగౌడ్, అంబేద్కర్ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ప్రభాకర్ ఆధ్వర్యంలో...
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కంది మండలంలోని ఇంద్రకర ణ్ గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాల య సంస్థ చైర్మన్ నరహరిరెడ్డితో పాటు పార్టీ నాయకులు, కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.
జహీరాబాద్‌లో..
ప్రజలందరి అభివృద్ధి అంబేద్కర్ లక్ష్యమని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, స్థానిక ఎమ్మెల్యే కొనింటి మానిక్యరావు అన్నా రు. జహీరాబాద్ పట్టణంలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ కన్వీనర్ నరసింహులు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. జహీరాబాద్లో అంబేద్కర్ భవనం కోసం నిధులు మంజూరు చేసి నిర్మాణానికి కృషి చేయాలని ఎమ్మెల్యే మాణిక్యరావు కోరగా ఎంపీ స్పందిస్తూ త్వరలో నిధులతో పాటు భవన నిర్మాణానికి రూ.3 కోట్లు మం జూరయ్యేలా చూస్తానన్నారు. అలాగే మొగుడంపల్లి, నాల్కల్ మండలాల్లో ఘన నివాళు లు అర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు రాములన్న, గౌతమ్, జనార్ధన్, విజ య్కుమార్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌లో..
నారాయణఖేడ్ పట్టణంలోని స్థానిక చౌరస్తాలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశే ఖర్రెడ్డి, నాయకులు సుధాకర్రెడ్డి, గుండు లక్ష్మణ్, వినోద్ పాటిల్, రమేశ్ చౌహాన్, పండరీరెడ్డి, అర్జున్, సామెల్, సంజయ్, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇలావుండగా మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పటాన్చెరులో...
పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. బడుగు, బలహీనవర్గాలకు సమాన హక్కులు సాధించడంలో అంబేద్కర్ ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మా.జీ చైర్మన్ విజయ్కుమార్, సీఐ వినాయకరెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహా రెడ్డి, వెంకటేశ్, ఎర్ర బిక్షపతి, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా వేడుకలు..
సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండలంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. కొండాపూ ర్ మండలం సైదాపూర్లో అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు తలారి కుమార్, మాజీ సర్పంచ్ అరుణ వంశీధర్గౌడ్, లక్ష్మణ్గౌడ్ తదితరులు అంబేద్కర్కు నివాళులు అర్పించారు. నాగల్ గిద్ద మండల కేంద్రంలో ఎంపీడీవో మహేశ్వరరావు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అలాగే మునిపల్లి మండల వ్యాప్తంగా దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఖమ్మంపల్లిలో వేడుకలు నిర్వహించారు.