14-04-2025 08:12:38 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బిజెపి మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశ ప్రజల కోసం తన ప్రాణాలను కుటుంబాన్ని సైతం త్యాగం చేసి రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. ఆయన రాసిన రాజ్యాంగమే ఈ దేశానికి మార్గదర్శకంగా దిశా నిర్దేశం చేస్తూ పరిపాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కుమ్మరి నర్సింలు, పోతరాజు కిషన్, మండల ప్రధాన కార్యదర్శి కురుమ గణేష్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, శక్తి కేంద్రం ఇంచార్జ్ చిక్కుడు స్వామి, ముత్యాల శ్రీనివాస్, నాయకులు స్వామి, ఆది మహేష్, పులి గారి స్వామి తదితరులు పాల్గొన్నారు.