14-04-2025 12:00:00 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, జ్యోతిరావ్ పూలే, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసిన గ్రామస్తులను అభినందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని పేర్కొన్నారు. తాటికోల్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేసి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.