calender_icon.png 25 February, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యానికి పాటుపడాలి

25-02-2025 12:00:00 AM

పోలీస్ కమిషనర్ సునీల్ దత్ 

ఖమ్మం, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): మత సామరస్యానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. మార్చి 2 నుంచి ప్రారంభంకానున్న రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మసీదు (ఇంచార్జులు) ముస్లిం మత పెద్దలతో సోమవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ...మత సామరస్యానికి ప్రతీకగా ఖమ్మం జిల్లా వుందని, సోదర భావంతో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ మెలగడం జిల్లాలో మంచి సంప్రదాయమని అన్నారు. ఇదే స్పూర్తితో రంజాన్ ఉపవాస దీక్షలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.

ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసుశాఖ దృష్టికి తీసుకురావాలని ముస్లిం మత పెద్దలకు సూచించారు. ఈ సందర్బంగా వివిధ మత పెద్దలు తమ అభిప్రాయాలను వెల్లడించి పోలీసు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యకు తమవంతు సహకాహరం అందజేస్తామని అన్నారు.సమావేశంలో అడిషనల్ డీసీపీ లా%ఞ%ఆర్డర్ ప్రసాద్ రావు, టౌన్ ఏసీపీ రమణమూర్తి, సిఐ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.