calender_icon.png 18 April, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి

09-04-2025 10:44:50 PM

సమసమాజ నిర్మాణం కోసం పోరాడిన నేతలే నేటి తరానికి ఆదర్శం..

సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు.. 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కార్మిక వర్గం కోసం, పేద ప్రజలకోసం తమ జీవితాలను అంకితం చేసి పోరాడిన నాటి అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకోసం నేటితరం కమ్యూనిస్టు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా  కోరారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ సెంటర్లో పుననిర్మించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యులు, స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు దేవూరి శేషగిరిరావు విగ్రహాన్ని, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మాజీ అధ్యక్షులు బందెల నర్సయ్య విగ్రహాన్ని బుధవారం వారు ఆవిష్కరించారు. తొలుత నేతల చిత్రపఠాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులిర్పించారు. 

అనంతరం జరిగిన  సభలో వారు మాట్లాడుతూ.. సింగరేణి ప్రధాన కార్యాలయంలో సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన శేషగిరిరావు నాడు నాటి బ్రిటీష్ తెల్లదొరల కార్మికుల దోపిడికి వ్యతిరేకంగా పోరాటాలకు శ్రీకారం చుట్టారన్నారు. బొగ్గుగనుల్లో మహిళలు, పిల్లలతో పనిచేయించే విధాన్ని వ్యతిరేకించిన తొలితరం ఉద్యమకారుడు శేషగిరిరావు అని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో ఈ ప్రాంతంలో బ్రిటీష్ దోరల నిరంకుషపాలనకు, రజాకార్ల దొపిడి వ్యవస్థ నిర్మూళనకోసం పోరాడిన ధీశాలి శేషగిరిరావు అని, అజ్ఞాత దళానికి నాయకత్వం వహించి పోరాడన్నారు. సింగరేణి, ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశ్రమల్లో ఎనిమిది గంటల పనివిధానం అమలు ఆయన పోరాట ఫలితమేనన్నారు.

కార్మికవర్గం, ప్రజలకోసం పోరాడిన శేషగిరావుతో పాటు ఆయనతో సహచరులు రంగయ్య, పాపయ్యలు అప్పటి రజాకార్లు బూర్గంపాడు ప్రాంతంలో కాల్చి చంపారని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య, వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థి దశనుంచే కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకు ఆకర్షితులైన రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన బందెల నర్సయ్య సీపీఐ, ఏఐటీయూసీలో రాష్ట్ర స్థాయికి ఎదిగారని, కొత్తగూడెం ప్రాంతాల్లో పార్టీ, యూనియన్ విస్తరణకు ఎనలేని కృషి చేశారన్నారు. గని కార్మిక ఉద్యమాలకు, అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి ఎన్నో విజయాలు సాదించారన్నారు.

సిహెచ్పిఎస్ జిల్లా నేతగా, రాష్ట్ర నాయకుడిగా దళిత వర్గ సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. ఎలాంటి నేతను కొత్తగూడెం ప్రాంతం కోల్పోవడం బాధాకరమని, ఆయన ఆశయాల సాధనకు పార్టీ, ప్రజాసంఘాల నాయకులు కృషి చేయాలన్నారు. వాసిరెడ్డి మురళి, గనిగళ్ళ వీరస్వామి, తోట రాజు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, తాటి వెంకటేశ్వర్లు, డీ వెంకన్న, సరెడ్డి పుల్లా రెడ్డి, చంద్రగిరి శ్రీనివాస్ రావు, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్ర కుమార్, జిల్లా సమితి సభ్యులు ధమాలపాటి శేషయ్య, వంగ వెంకట్, వట్టికొండ మల్లికార్జునరావు, కంచర్ల జమలయ్య, రమణ మూర్తి, భూక్యా శ్రీను, భూక్యా డస్రు, పోలుమూరిశ్రీనివాస్, లక్ష్మిపత్తి, జక్కుల రాములు, కుమారి హనుమత్ రావు, బరిగల సంపూర్ణ, ఫహీమ్, రత్న కుమారి, మునిగడపు వెంకటేశ్వర్లు, రామచందర్, వెంకటరమణ, మద్దెల శివకుమార్, సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులు, బందెల నరసయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.