calender_icon.png 19 April, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి

18-04-2025 01:37:32 AM

  1. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల డిమాండ్
  2. గాంధీభవన్ వద్ద ధర్నా, అరెస్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూని వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని తెలంగాణ యూ నివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నాంపల్లిలోని గాంధీ భవన్ వర కు ర్యాలీ నిర్వహించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

పోలీసులు వారిని అడ్డుకోవడంతో గాంధీ భవ న్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఆందోళనకారులను పోలీసు లు అరెస్ట్ చేసి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే నగరంలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ, నిజాంకాలేజీ, సైఫాబాద్ కాలేజీల నుంచి ధర్నాకు వస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశా రు.

ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏ సీ రాష్ట్ర సమన్వయ కమిటీ నాయకులు డా. ఉపేందర్, డా.విజేందర్‌రెడ్డి, డా.వేల్పుల కుమా ర్, డా.గంగాకిషన్, డా.శ్రీధర్‌రెడ్డి, సురేష్‌నాయక్, డా.సునీత తదితరులు మాట్లా డుతూ..

15 20 ఏండ్ల తరబడి వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే రెగ్యులర్ ప్రొఫెసర్ల నియామకాల కంటే ముందు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెచ్చిన జీవో 21ని రద్దు చేయాలని కోరారు. 

పార్ట్ టైం అధ్యాపకుల ఛలో సెక్రటేరియట్

అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు రెగ్యులర్ పోస్టుల నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.సోమేశ్వర్ బోనకుర్తి, ప్రధాన క్యాదర్శి డా.ఆరుట్ల జానకిరెడ్డి, నాయకులు డా.తిరుణహరి శేషు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు గురువారం ఛలో సెక్రటేరియట్‌కు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి చిక్కడపల్లి, సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్ట్ టైం అధ్యాపకులకు టైమ్ స్కేల్‌తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే రెగ్యులర్ అధ్యాపకుల నియామకాల్లో తమకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.