calender_icon.png 23 April, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు వైద్య సేవలందించి ప్రాణదాతగా పేరుతెచ్చుకోవాలి

23-04-2025 12:46:25 AM

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

బిజినేపల్లి ఏప్రిల్ 22 : గ్రామీణ ప్రాంత నిరుపేద ప్రజలకు వైద్య సేవలు అందించి ప్రాణదాతగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఎంబీబీఎస్ వైద్య విద్య పూర్తి చేసిన కా ట్రావత్ శ్యామలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మర్రి జమున దంపతులు ఆశీర్వదించారు. బిజినేపల్లి మండలంలోని ఊ డుగులకుంట తాండకు చెందిన కాట్రావత్ పాండు నాయక్ చాందీ దంపతుల కుమార్తె కాట్రావత్ శ్యామలకు 4 సంవత్సరాల క్రిత్తం ఎంబీబీఎస్ లో సీటు సాధించింది.

కానీ ఆ కుటుంబం రెక్కాడితే గాని డొక్క నిండని క టిక పేదరికంలో మగ్గుతున్న పరిస్థితిని తెలుసుకొని అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా 4 ఏండ్ల పాటు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. ఎంబీబీఎస్ విద్య పూర్తి చేసుకొని పట్టాతో మంగళవారం హైదారాబాద్ లోని మాజీ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహాంలో శ్యామల తన తల్లిదండ్రులతో మాజీ ఎమ్మె ల్యే దంపతులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఎంబీబీఎస్ పట్టాతో ఇంటికి వచ్చిన డాక్టర్ శ్యామలను శాలువాతో సన్మానించి ముందు ముందు ఎలాంటి అవసరం ఉన్నా సహాయ సహాకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉన్నత శిఖరాలకు చేరుకొని పేదలకు సహాయ సహకారాలు అం దించాలని సూచించారు.