calender_icon.png 19 March, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఠానునాయక్ స్ఫూర్తితో ఉద్యమించాలి

19-03-2025 12:00:00 AM

తెలంగాణ గిరిజన సంఘం 

మహాబూబాబాద్ మార్చి 18 :(విజయ క్రాంతి ) మహాబూబాబాబ్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి తండాలో తెలంగాణ గిరిజన సంఘం సమావేశం బానోత్ రాజేష్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య హరినాయక్ పాల్గొని మాట్లాడుతూ నేటి యువత ఠాను నాయక్ స్ఫూర్తితో ఉద్యమాలలో పాల్గొని గిరిజనుల హక్కుల కోసం,ప్రజా వ్యతిరేక విధానాలకు తిప్పి కొట్టే విధంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం, భూస్వాములు,పెత్తందారుల దౌర్జన్యాలు,ఆగడాలకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం చేసి గడగడ లాడించిన పోరాట యోధుడు ఠాను నాయక్ అని అన్నారు.మార్చి 20న ఠాను నాయక్ వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలతో పాటు తండాలలో ఘనంగా నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు గుగులోతు శంకర్ నాయక్, ధరావత్ రమేష్ నాయక్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.