calender_icon.png 6 November, 2024 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగల వాటా కోసం ఉద్యమించాలి

19-07-2024 03:33:55 AM

  • ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య

ముషీరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): మాదిగల సంక్షేమం, రాజకీయ రంగా ల్లో రావాల్సిన వాటా కోసం నూతన ప్రజాస్వామిక మాదిగ ఉద్యమాన్ని నిర్మించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్  అనుబంధ సం ఘాల జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏండ్లుగా ఎమ్మార్పీఎస్ సుదీర్ఘ పోరా టం చేస్తోందన్నారు.

సమాజానికి అనేక సంక్షేమ పథకాలను సాధించి పెట్టిందన్నా రు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాదిగలను మనువాదులకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. మాదిగలకు న్యా యం జరగాలంటే ఆర్టికల్ 371 ని సవరిస్తే సరిపోతుందన్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఆర్టికల్ 341 సవరణ కావాలని మందకృష్ణ మాదిగ కోరుకుంటున్నారన్నా రు. సమావేశంలో సంఘం తెలంగాణ రాష్ట్ర కోఆర్టినేటర్ మాదంగి ఓదేలు, నాయకులు ఎస్‌కే ఇస్లామోద్దీన్, సండ్రు నరసింహ, జగ న్, ఏటుకూరి విజయ్, రావినూతల కోటి, ఆర్‌ఎన్ రాజా, బడుగుల బాలకృష్ణ, సాగడి శంకర్ పాల్గొన్నారు.